దుత్తలూరు వాసికి రాష్ట్ర స్థాయి ఉద్యోగం

దుత్తలూరు వాసికి రాష్ట్ర స్థాయి ఉద్యోగం

నెల్లూరు జిల్లా దుత్తలూరుకు చెందిన భారతాల ఉదయ్ శంకర్ రాష్ట్ర స్థాయి ఉద్యోగానికి ఎంపికయ్యారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన ఫలితాల్లో ఆయన "స్టేట్ టాక్స్ అసిస్టెంట్ కమిషనర్"గా నియామకమయ్యారు. ఈ విజయంతో ఉదయ్ శంకర్‌కు కుటుంబ సభ్యులు, గ్రామస్థుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన సాధించిన ఈ విజయం దుత్తలూరు ప్రాంతానికే గర్వకారణంగా నిలిచింది.