విద్యార్థినిని ఢీ కొట్టిన కళాశాల బస్సు
PLD: నరసరావుపేట పట్టణంలోని గడియార స్తంభం వద్ద మంగళవారం ఒక కళాశాల బస్సు అధిక వేగంతో రోడ్డు మీద ఉన్న విద్యార్థిని ఢీకొట్టింది. రావిపాడు గ్రామానికి చెందిన సింధు అనే ఏడో తరగతి విద్యార్థిని మున్సిపల్ స్కూల్లో చదువుతుంది. బస్సు ఢీకొనడంతో గాయపడిన సింధుని స్థానికులు తక్షణమే ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. ఈ ప్రమాదం గురించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.