క్వింటా పత్తి ధర రూ. 7600

WGL: ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో నిన్నటితో పోలిస్తే నేడు పత్తి ధర తగ్గింది. సోమవారం, మంగళవారం, బుధవారం క్వింటా పత్తి ధర రూ.7,560 పలకగా.. గురువారం రూ.7,700కి చేరింది. అలాగే శుక్రవారం ధర తగ్గి రూ.7,600కి చేరినట్లు వ్యాపారులు తెలిపారు. మార్కెట్‌కి ఈరోజు పత్తి స్వల్పంగా తరలివచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు.