దారుణం.. పిల్లలకు గడ్డి మందు తాగించిన తండ్రి
KNR: జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. జూబ్లీనగర్‌కు చెందిన శ్రీశైలం తన ఇద్దరు కుమార్తెలను చంపి బావిలో పడేసాడు. భార్యతో గొడవపడి ఐదేళ్ల కవలలకు గడ్డి మందు తాగించి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సమాచారం. ఒక చిన్నారి మృతదేహం వెలికితీయగా, మరో చిన్నారి కోసం గాలింపు చర్యలు కోనసాగుతున్నాయి. ఈ దారుణానికి ఒడిగట్టిన శ్రీశైలంను స్థానికులు పోలీసులకు అప్పగించారు.