VIDEO: పుంగనూరులో కాటమరాజు ఊరేగింపు
CTR: పుంగనూరు పట్టణంలో మంగళవారం రాత్రి కాటమరాజు ఊరేగింపు అత్యంత సందడిగా సాగింది. చింతల వీధిలో ప్రారంభమైన ఈ యాత్ర డప్పు వాయిద్యాలు, బాణాసంచా హోరు నడుమ తూర్పు మొగసాల వరకు కొనసాగింది. కదిరి పౌర్ణమి సందర్భంగా నిర్వహించే ఈ ఉత్సవంలో యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం సంప్రదాయబద్ధంగా కామదహన కార్యక్రమాన్ని నిర్వహించారు.