రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే
కృష్ణా: చిన్నపాండ్రక గ్రామం రైస్ మిల్లు నుంచి రామాపురం, నాలుగు రోడ్లు కూడలి నుంచి ఇంతేరు వెల్లు వరకు రోడ్ల నిర్మాణం చేపట్టారు. రూ. 3,65,18,296 నిధులతో చేపట్టే ఈ తారు రోడ్లకు ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామన్నారు. రాబోయే రోజుల్లో పెడనని అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు.