500 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడాం: రంగనాథ్

HYD: హైదరాబాద్ మున్సిపల్ అభివృద్ధిలో భాగంగా, హైడ్రా సంస్థ ఏడాదిలోనే 500 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమణల నుంచి రక్షించిందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. హైడ్రా లాంటి సంస్థ దేశంలో ఇదే మొదటిదని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, ప్రస్తుతం 6 చెరువులను అభివృద్ధి చేస్తున్నామన్నారు. 100 ఏళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని హైడ్రా పనిచేస్తుందని వెల్లడించారు.