'నిరంతర విద్యుత్ సరఫరాకు నూతన విద్యుత్ సబ్‌స్టేషన్లు'
JGL: వేసవికాలంలో వినియోగదారులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలనే సంకల్పంతో నూతనంగా విద్యుత్ సబ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నట్లు జగిత్యాల జిల్లా విద్యుత్ అధికారి బీ.సుదర్శనం అన్నారు. కోరుట్ల పట్టణంలోని సబ్ స్టేషన్‌లో భవిష్యత్తు అవసరాల దృష్ట్యా నూతన 8 ఎంవీఏ సామర్థ్యం గల విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్‌ను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ అధికారులు పాల్గొన్నారు.