బీసీ వసతి గృహాలను పరిశీలించిన అధికారి
SRD: సదాశివపేట పట్టణంలోని బీసీ బాలుర, బాలికల హాస్టల్స్ జిల్లా అధికారి జగదీష్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం రుచి చూశారు. మెనూ ప్రకారం భోజనం అందించాలని సూచించారు. అనంతరం వంట గదిని పరిశీలించారు. పదవ తరగతి విద్యార్థులతో మాట్లాడి ఎలా చదువుతున్నారో అడిగి తెలుసుకున్నారు.