బాధితులకు న్యాయం జరిగేలా కృషి చేయాలి: ఎస్పీ
కృష్ణా: అవనిగడ్డ సబ్ డివిజన్ పోలీస్ అధికారులతో ఎస్పీ విద్యాసాగర్ నాయుడు గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా ఎస్పీ మాట్లాడుతూ.. అపరిష్కృతంగా ఉన్న కేసులను సమగ్రమైన దర్యాప్తు పూర్తి చేసి, మహిళా సంబంధిత నేరాల్లోనూ ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, నిర్దేశిత సమయంలో బాధితులకు న్యాయం జరిగేలా ప్రతి ఒక్క పోలీస్ అధికారి కృషి చేయాలని సూచించారు.