తెలంగాణ ఉద్యమకారుల ఫోరం అధ్యక్షునిగా రమేష్
SRPT: తెలంగాణ ఉద్యమకారుల ఫోరం సూర్యాపేట జిల్లా అధ్యక్షునిగా గుండెపంగు రమేష్ నియమితులయ్యారు. ఇవాళ కోదాడలో నిర్వహించిన సమావేశంలో ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు చీమ శ్రీనివాస్ రావు ఈ నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ.. నాడు జైలు జీవితం గడిపిన తనను గుర్తించి బాధ్యత ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు.