పేదల కోసం ఎకరం విరాళం.. కలెక్టర్ ప్రశంసలు

పేదల కోసం ఎకరం విరాళం.. కలెక్టర్ ప్రశంసలు

ADB: సాత్నాల మండలం దుబ్బగూడ గ్రామానికి చెందిన ఆత్రం జంగు తన భూమిలోని ఎకరం పోలాన్ని 10 మంది ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణానికి స్వచ్ఛందంగా విరాళంగా ఇచ్చారు. ఈ సందర్భంగా మంగళవారం కలెక్టర్ రాజర్షిషా ఆత్రం జంగు దంపతులను శాలువాతో సన్మానించారు. ఆయన మాట్లాడుతూ.. పేదల కోసం ఇలాంటి మంచి నిర్ణయం తీసుకోవడం గొప్ప విషయమన్నారు.