నేడు టీటీడీ బోర్డు కీలక సమావేశం
TPT: తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో TTD బోర్డు అత్యవసర సమావేశం మంగళవారం జరగనుంది. ప్రధానంగా వైకుంఠ ద్వార దర్శనాలపైనే చర్చిస్తారని సమాచారం. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని 10 రోజుల పాటు దర్శన టికెట్ల జారీపై చర్చించి కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటికే దీనిపై టీటీడీ ఈవో పరిశీలన చేశారు. ఆయన బోర్డు దృష్టికి సంబంధిత విషయాలను తీసుకెళ్లారు.