కలెక్టర్‌కు లేఖ రాసిన విద్యార్థులు

కలెక్టర్‌కు లేఖ రాసిన విద్యార్థులు

RR: కొందుర్గు మండలం చెరుకుపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల విద్యార్థులు జిల్లా కలెక్టర్, డీఈఓకు ఈరోజు లేఖ రాశారు. మా పాఠశాలలో పనిచేస్తున్న సుష్మ అనే టీచర్ గండిపేట పాఠశాలకు డిప్యూటేషన్‌పై వెళ్లిందని, దీంతో మా పాఠశాలలో శివారెడ్డి అనే టీచర్ ఒకరే ఉండడంతో చదువు బోధించడం ఇబ్బందిగా మారిందని, వెంటనే సుష్మ టీచర్‌ను మా పాఠశాలకు పంపించాలని విద్యార్థులు లేఖలో కోరారు.