నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక
శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ స్వప్నల్ దినకర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజలు నేరుగా గాని, వెబ్ సైట్‌లో గాని తమ సమస్యలను తెలియజేయాలని అన్నారు. లేదా 1100 నెంబర్‌ను సంప్రదించాలని సూచించారు. ఈ విషయాన్ని గమనించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.