'విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి'
KMR: బిక్కనూర్ విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, మండల వైద్యురాలు దివ్య చెప్పారు. శుక్రవారం మండల కేంద్రంలోని స్థానిక బీసీ బాలుర వసతి గృహంలో, విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అవసరమున్న వారికి మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్ అధికారిని సునీత, హెల్త్ అసిస్టెంట్ సతీష్, ఏఎన్ఎం శ్యామల, ఆశా కార్యకర్త సుకన్య ఉన్నారు.