'శాస్త్రీయ వ్యవసాయంపై మొగ్గు చూపాలి'
VZM: రైతులు శాస్త్రీయ వ్యవసాయంపై మొగ్గు చూపాలని మండల వ్యవసాయ అధికారి పి శ్రీలక్ష్మి సూచించారు. సతివాడ రైతు సేవా కేంద్రంలో రైతన్న మీకోసం కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏవో లక్ష్మి మాట్లాడుతూ.. రైతులకు ప్రభుత్వం అందిస్తున్న పంచ సూత్రాలు, శాస్త్రీయ వ్యవసాయం, నీటి భద్రత వంటి అంశాలు గురించి వివరించారు.