ప్రభుత్వ వైద్య కళాశాలలో ఫ్రెషర్స్ డే
కర్నూలు నగరంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలోని ఆడిటోరియంలో శుక్రవారం ఫ్రెషర్స్ డే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు సంప్రదాయ వస్త్రదారణతో ఆకట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ఆడిటోరియంలో నిర్వహించిన సంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షనగా నిలిచాయి.