చేనేత కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలి: రామయ్య

చేనేత కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలి: రామయ్య

KDP: చేనేత కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య కోరారు. సిద్ధవటం మండలం ఉప్పరపల్లిలో శనివారం ఆయన మాట్లాడారు. గత ఐదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా చేనేత కార్మికుల మగ్గాల గుంతల్లోకి ఊటనీరు చేరి జీవనోపాధి కోల్పోయారన్నారు. మగ్గాలు తడిసి పట్టు, తదితర సామాగ్రి పాడైపోయాయన్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.