ఎర్రగట్టుగుట్టలో పద్మశాలి వనభోజనం
HNK: హాసన్‌పర్తి మండలం ఎర్రగట్టు గుట్ట వద్ద ఆదివారం అఖిలభారత పద్మశాలి సంఘం, పరపతి సంఘాల ఆధ్వర్యంలో కార్తీక మాస వనభోజన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా మేయర్ గుండు సుధారాణి, కమలాపూర్ మార్కెట్ ఛైర్మన్ తౌటం ఝాన్సీ రాణి హాజరయ్యారు. మేయర్ మాట్లాడుతూ.. పద్మశాలీయులు ఐక్యంగా ఉంటూ తమ హక్కుల సాధన, సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు.