VIDEO: మొక్కజొన్న చేనుకు నిప్పు పెట్టిన దుండగులు
MHBD: గంగారం మండలం పెద్ద ఎల్లాపురం గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు గుండాగాని రాజు అనే రైతుకు చెందిన మొక్కజొన్న చేనులో నిప్పు పెట్టారు. ఈ ఘటన బుధవారం చోటుచేసుకున్నది. బాధిత రైతు తెలిపిన వివరాల ప్రకారం.. మొక్కజొన్న కంకి పూర్తిగా కాలిపోగా, సుమారు రూ.2 లక్షల వరకు ఆర్థిక నష్టం కలిగినట్లు ఆయన తెలిపారు. పోలీసులు ఘటన పై విచారణ చేపట్టారు.