బిర్సా ముండా జయంతి వేడుకల్లో పాల్గొన్న కలెక్టర్
MDK: బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా గిరిజన హక్కుల కోసం పోరాడిన మహా నాయకుడు బిర్సా ముండా అని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా 150వ జయంతిని పురస్కరించుకొని చిత్రపటానికి పూలమాలలు వేసి కలెక్టర్ నివాళులర్పించారు. ఆయన జీవితమే ఆదివాసి హక్కుల సాధనకు, స్వాతంత్య్ర పోరాటానికి స్ఫూర్తిదాయకమన్నారు.