VIDEO: చెరువులో హార్వెస్టర్ బోల్తా... డ్రైవర్ సురక్షితం
NZB: సాలూరు మండలం హుంన్సా రామ్ సాల చెరువులో ఇవాళ సాయంత్రం ఒక హార్వెస్టర్ బోల్తా పడిందని స్థానికులు తెలిపారు. హుంన్సా నుంచి మందర్న గ్రామం వైపు వెళ్తుండగా అదుపుతప్పి నీటిలో పడిపోయిందని వారు పేర్కొన్నారు. డ్రైవర్‌ను స్థానికులు వెంటనే స్పందించి కాపాడారు. సమయానికి సాయం అందడంతో పెద్ద ప్రమాదం తప్పిందని పేర్కొన్నారు.