ఏఐ ఆధారిత వృద్ధిలో ఏపీది కీలకపాత్ర: కేంద్రమంత్రి
ఏఐ ఆధారిత వృద్ధిలో ఏపీ కీలకపాత్ర పోషిస్తోందని కేంద్రమంత్రి అశ్వనీ వైష్ణవ్ తెలిపారు. 2026 ఫిబ్రవరిలో భారత్‌లో ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. సదస్సులో భాగంగా దేశ వ్యాప్తంగా 200 కార్యక్రమాలు చేపడతామని అన్నారు. ఏపీ, మహారాష్ట్ర, యూపీ తదితర రాష్ట్రాల్లో డేటా సెంటర్లు వస్తున్నాయన్నారు. డేటా సెంటర్ల కేంద్రంగా విశాఖ ఎదగడం శుభపరిణామమని పేర్కొన్నారు.