పోలీసుల అదుపులో మద్యం కేసు ఏ-20 నిందితుడు

పోలీసుల అదుపులో మద్యం కేసు ఏ-20 నిందితుడు

AP: నకిలీ మద్యం కేసులో నిందితుడు మనోజ్ కుమార్‌ను ఎక్సైజ్ శాఖ అధికారులు అదుపులోకి తీసుకుని విచారించారు. విజయవాడలోని ఎక్సైజ్ కార్యాలయంలో విచారిస్తుండగా మనోజ్ అస్వస్థతకు గురికావడంతో ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు. చికిత్స తర్వాత మనోజ్‌కు 41ఏ నోటీసులు ఇచ్చి పంపించినట్లు తెలుస్తోంది. నకిలీ మద్యం కేసులో మనోజ్ ఏ20గా ఉన్నాడు.