గణేష్ మండళ్ల నిర్వాహకులు నిబంధనలు పాటించాలి: సీపీ

NZB: గణేష్ మండళ్ల నిర్వాహకులు నిబంధనలు తప్పకుండా పాటించాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సూచించారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. గణేష్ విగ్రహ ఏర్పాటు కోసం ప్రజల నుండి డబ్బులను బలవంతంగా వసూలు చేయరాదన్నారు. గణేష్ మండపాలను ట్రాఫిక్ ఇబ్బంది లేని ప్రదేశాల్లోనే నెలకొల్పాలని స్పష్టం చేశారు.