ఇరాన్‌ దాడులపై ఐరాస ఆగ్రహం

ఇరాన్‌ దాడులపై ఐరాస ఆగ్రహం

గల్ఫ్ దేశాలపై ఇరాన్ జరుపుతున్న దాడులను ఖండిస్తూ ఐక్య రాజ్య సమితి భద్రతా మండలి చారిత్రక తీర్మానాన్ని ఆమోదించింది. టెహ్రాన్‌ తక్షణమే తన దాడులను నిలిపివేయాలని ఈ తీర్మానం డిమాండ్ చేసింది. GCC నేతృత్వంలో రూపొందిన ఈ ప్రతిపాదనకు భారత్ సహా రికార్డు స్థాయిలో 135 దేశాలు మద్దతు తెలపడం విశేషం. 15 సభ్య దేశాల్లో 13 అనుకూలంగా ఓటు వేయగా.. రష్యా, చైనాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి.