గొర్రపల్లిలో 'కాఫీ విత్ వైసీపీ లీడర్స్' కార్యక్రమం

సత్యసాయి: పరిగి మండల పరిధిలోని గొర్రపల్లిలో జిల్లా వైసీపీ అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ ‘కాఫీ విత్ వైసీపీ లీడర్స్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. సోమవారం ఉదయం గ్రామంలోని వైసీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి గుడ్ మార్నింగ్ అంటూ ప్రజలతో మమేకమయ్యారు. వైసీపీ హయాంలో అమలైన పథకాల గురించి ప్రజలకు వివరించారు. సూపర్-6తో సీఎం చంద్రబాబు మోసం చేశారని మండిపడ్డారు.