'ప్రభుత్వ పోషకాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలి'
BDK: గర్భిణులు, బాలింతలు ప్రభుత్వం అందిస్తున్న పోషకాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ మంజుల కోరారు. లక్ష్మీదేవిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని అంగన్వాడీ కేంద్రాన్ని సర్పంచ్ భూక్యా మంజుల గురువారం తనిఖీ చేశారు. కేంద్రంలోని రికార్డులను, నిల్వ ఉన్న సరుకుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. తల్లులకు, చిన్నారులకు పౌష్టికాహారాన్ని పంపిణీ చేశారు.