కొత్తపేటలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం

GNTR: శుక్రవారం రోజు గుంటూరు కొత్తపేట వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందినట్లు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే కొత్తపేట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. వివరాలు తెలియకపోవడంతో మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.