'వరదల పట్ల అప్రమతంగా ఉండాలి'

భద్రాద్రి: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల జిల్లా అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. శుక్రవారం అదనపు కలెక్టర్, ఆర్డీవోలు,తాసీల్దారులు, ఎంపీడీవోలు, ఇరిగేషన్ మరియు జిల్లా అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా ఎడతెరిపి లేకుండా కురుస్తున వర్షాలపై తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సమీక్ష సమావేశం నిర్వహించారు.