విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే

MBNR: కౌకుంట్ల మండలం తిరుమలాపూర్‌లో పోచమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. ఉత్సవాలలో భాగంగా శుక్రవారం దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి పాల్గొని పోచమ్మ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామ దేవతల ఆశీస్సులతో పాడిపంటలు సమృద్ధిగా పండి ప్రజలు సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు.