సీఎం పర్యటన.. ముందస్తు అరెస్టులు
HYD: సీఎం రేవంత్ రెడ్డి ఓయూ పర్యటనలో భాగంగా మాల స్టూడెంట్ జేఏసీ మాదాసు రాహుల్ రావు, నాయకులను ముందస్తు అరెస్ట్ చేశారు. వారు మాట్లాడుతూ.. ఎలాంటి ముందస్తు అరెస్టులు లేకుండా ఓయూలో అందరిని కలిసి సమస్యలను తెలుసుకుంటానని చెప్పిన సీఎం ఇప్పుడు ఎందుకు ముందస్తు అరెస్టులు చేస్తున్నారో తెలియడం లేదన్నారు. మాల కులాలకు రావాల్సిన 2% రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.