పేకాట శిబిరంపై దాడి.. ఆరుగురు అరెస్ట్
BDK: దమ్మపేట మండలం దురదపాడు గ్రామ శివారులో మంగళవారం పేకాట ఆడుతున్న ముఠాపై పోలీసులు మెరుపు దాడి చేశారు. ఈ ఘటనలో ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకోగా,మరో ఇద్దరు పరారయ్యారు. నిందితుల నుంచి రూ.7,400 నగదుతో పాటు 5 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై సాయి కిషోర్ రెడ్డి వెల్లడించారు. జూద క్రీడలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.