పిన్నెల్లి బెయిల్ పిటిషన్ కొట్టివేత
AP: పల్నాడు జిల్లా గుండ్లపాడులో జంట హత్యల కేసులో నిందితుడు, వైసీపీ నేత పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి బెయిల్ పిటిషన్‌ను గురజాల కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో వెంకట్రామిరెడ్డి ఏ-7గా ఉన్నారు. కేసు తీవ్రతను పరిగణనలోకి తీసుకుని బెయిల్ మంజూరు చేయలేమని కోర్టు స్పష్టం చేసింది.