మల్లేపల్లిలో యువజనులకు క్రీడా సామగ్రి

మల్లేపల్లిలో యువజనులకు క్రీడా సామగ్రి

NRPT: మల్లేపల్లి గ్రామంలో మేరా యువభారత్ ఆధ్వర్యంలో యువ మండల్ వికాస్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వివేకానంద యువజన సంఘ సభ్యులకు వాలీబాల్, ఫుట్‌బాల్, హ్యాండ్ బాల్ సామగ్రి పంపిణీ చేశారు. జిల్లా కోఆర్డినేటర్ అనిల్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. యువజన సంఘాలను సంస్థతో అనుసంధానించడం లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కథలప్ప పాల్గొన్నారు.