VIDEO: మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగరవేస్తాం: మాజీ మంత్రి
MHBD: తొర్రూరు పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం జరిగిన మున్సిపాలిటీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మున్సిపాలిటీ అభివృద్ధి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే జరిగిందని, రానున్న మున్సిపల్ ఎన్నికల్లో అన్ని వార్డులు బీఆర్ఎస్ కైవసం చేసుకుని గులాబీ జెండా ఎగరవేస్తామన్నారు.