VIDEO: అందమైన బస్సు షెల్టర్.. కళావిహీనం
MDK: శివంపేట మండల కేంద్రంలో నిర్మించిన అందమైన బస్సు షెల్టర్ ఇప్పుడు కళాహీనంగా మారింది. 161 ఏఏ జాతీయ రహదారి పక్కన ‘ఐ లవ్ శివంపేట’ ఆకృతులు, గ్లాస్ ప్యానెల్‌లతో ఆకర్షణీయంగా ఏర్పాటు చేసిన ఈ బస్సు షెల్టర్‌పై గ్లాసులకు వివిధ పోస్టర్లు అతికించడంతో అందం దెబ్బతింది. పోస్టర్లను తొలగించి షెల్టర్‌ను తిరిగి శుభ్రంగా, అందంగా ఉంచాలని స్థానికులు కోరుతున్నారు.