జైనథ్‌లో 3 రోజుల పాటు కొనుగోళ్లు నిలిపివేత

జైనథ్‌లో 3 రోజుల పాటు కొనుగోళ్లు నిలిపివేత

ADB: వాతావరణ పరిస్థితులు అనుకూలించని కారణంగా జైనథ్ మార్కెట్ యార్డులో ఏప్రిల్ 5 నుంచి 7 వరకు శనగల కొనుగోళ్లు నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ 3 రోజుల పాటు రైతులు తమ పంటను మార్కెట్‌కు తీసుకురావద్దని సూచించారు. అకాల వర్షాల ముప్పు పొంచి ఉన్నందున రైతుల ప్రయోజనాల దృష్ట్యా యార్డును తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు తెలిపారు.