సీఎం పర్యటనపై పెద్ది సుదర్శన్ రెడ్డి విమర్శలు

సీఎం పర్యటనపై పెద్ది సుదర్శన్ రెడ్డి విమర్శలు

WGL: నర్సంపేటలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనపై మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆక్షేపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల నిబంధనలు అమల్లో ఉన్నప్పుడు శంకుస్థాపనలు, సభలు నిర్వహించడం తగదని అన్నారు. అభ్యర్థులు హాజరైతే అనర్హత వేటు పడే అవకాశం ఉందన్నారు. నర్సంపేటలో అభివృద్ధి నిలిచిపోయిందని, పంచాయితీ ఎన్నికలకే సీఎం పర్యటన వాడుతున్నారని విమర్శించారు.