ప్రభుత్వ కార్యాలయంలో అవినీతి ఆరోపణలు

ప్రభుత్వ కార్యాలయంలో అవినీతి ఆరోపణలు

కృష్ణా: జిల్లా పంచాయతీ అధికారి వారి కార్యాలయంలో అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి. కార్యాలయంలో పని చేస్తున్న ఓ కీలక అధికారి పెద్ద ఎత్తున వసూలు చేస్తున్నారన్న వార్తలు గుప్పుమంటున్నాయి. రిటైర్మెంట్‌కు దగ్గరగా ఉన్న ఆ పంచాయతీ అధికారి కార్యదర్శులను టార్గెట్ చేసుకుని వసూళ్లకు పాల్పడుతున్నారని, ఇవ్వని వాళ్లను ఇబ్బంది పెడుతున్నారని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు.