VIDEO: అదృశ్యమైన వ్యక్తి మృతదేహం లభ్యం
ASF: చింతల మానేపల్లి మండలం హెటీగూడకు చెందిన కొట్రంగి భీమ్రాం మృతదేహం శుక్రవారం లభ్యమైంది. బెజ్జూర్ మండలం సమీపంలోని పెద్దగుట్ట అటవీ ప్రాంతంలో కట్టెల కోసం వెళ్లిన వారికి శవం కనిపించడంతో గ్రామస్థులకు సమాచారం అందించారు. గత శుక్రవారం ఇంటి నుంచి వెళ్లిన భీమ్రాం తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనలో ఉన్నారు. మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.