పత్తికి గిట్టుబాటు ధర కరువు.. రైతుల ఆందోళన.!

పత్తికి గిట్టుబాటు ధర కరువు.. రైతుల ఆందోళన.!

NTR: మిర్చి నష్టాలతో పత్తి సాగు చేసిన రైతులు ఇప్పుడు గిట్టుబాటు ధరలు లేక ఆందోళన చెందుతున్నారు. ఎంత శ్రమించిన పంటకు ధర రాక నష్టపోతున్నామని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించినా, సీసీఐ అధికారుల నిబంధనలు కఠినంగా ఉండటం ఇబ్బందిగా మారిందని అంటున్నారు. పత్తిని సీసీఐ కేంద్రానికి తరలించేందుకే రూ.5 వేలకు పైగా ఖర్చవుతోందని రైతులు లబోదిబోమంటన్నారు.