డిసెంబర్ 1నుంచి రహదారి మూసివేత

డిసెంబర్ 1నుంచి రహదారి మూసివేత

W.G: భీమవరం - పిప్పర రహదారి నందు భారీ వాహనాలు రాకపోకలు డిసెంబర్ 1 నుండి తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు జిల్లా రహదారులు, భవనాల శాఖ అధికారి శ్రీనివాసరావు తెలిపారు. భీమవరం - పిప్పర రహదారి నందు గరగపర్రులో ఉండి కాలువపై ఉన్న వంతెన శిధిలావస్థలో ఉన్న కారణంగా భారీ వాహనాలు రాకపోకలు నిషేధించామని తెలిపారు. ప్రయాణికులు గమనించాలని ఆయన కోరారు.