గ్యాస్ సిలిండర్లు స్వాధీనం చేసుకున్న అధికారులు
KDP: పోరుమామిళ్ల, బి.మఠంలోని పలు రీఫిల్లింగ్ కేంద్రాలు, హోటళ్లపై V&E, సివిల్ సప్లై అధికారులు బుధవారం అకస్మిక దాడులు చేపట్టారు. గృహ వినియోగానికి కేటాయించిన LPG సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో నిందితులను అదుపులోకి తీసుకుని 4 కేసులు నమోదు చేశారు. మొత్తం 13 గ్యాస్ సిలిండర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.