ముగిసిన ప్రధాని పుట్టపర్తి పర్యటన
SS: ప్రధాని మోదీ పుట్టపర్తి పర్యటన ముగిసింది. పుట్టపర్తిలోని విమానాశ్రయంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వీడ్కోలు పలికారు. అక్కడి నుంచి తమిళనాడులోని కోయంబత్తూరుకు వెళ్లారు. సత్యసాయి బాబా శత జయంతి వేడుకల్లో పాల్గొన్న పీఎం మోదీ స్మారక నాణెం, ప్రత్యేక స్టాంపులను విడుదల చేసి, సభను ఉద్దేశించి ప్రసంగించారు.