'మహిళా పోలీసులకు అవగాహన'

కృష్ణా: నాగాయలంక ఎస్సై కె.రాజేష్ ఆధ్వర్యంలో బదిలీపై వచ్చిన మహిళా పోలీసులకు అవగాహన కార్యక్రమం గురువారం నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళల, బాలికల రక్షణపై దృష్టి పెట్టాలని ఎస్సై తెలిపారు. బాల్యవివాహాలు, గృహ హింస, మాదక ద్రవ్యాల వినియోగం తదితర అంశాలపై చట్ట జ్ఞానం కలిగి ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు.