మద్దిమడుగుకు త్వరలో రోడ్డు పనులు ప్రారంభం

NGKL: రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్య క్షేత్రం మద్దిమడుగులో సీసీ రోడ్డు పనులు త్వరలో ప్రారంభం కానున్నాయని ఛైర్మన్ డి.రాములు తెలిపారు. ఎమ్మెల్యే డాక్టర్ వంశీ కృష్ణ సహకారంతో దేవాలయం చుట్టూ 500 మీటర్ల సీసీ రోడ్డు మంజూరైందని చెప్పారు. ఈ పనుల కోసం మంగళవారం సర్వే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు ప్రణీత, నాగి రెడ్డి, సుబ్బదాసు, నాయకులు వెంకట్రామ్ పాల్గొన్నారు.