రైతును చెరువులో తోసి నగదుతో పరార్

నెల్లూరు: తక్కువ ధరకు డీజిల్ ఇస్తానని నమ్మించి ఓ అపరిచితుడు రైతును బూరీడి కొట్టించిన ఘటన ఆదివారం మనుబోలులో చోటు చేసుకుంది. మనుబోలుకు చెందిన ఓ రైతుకు బైకుపై వచ్చిన ఓ వ్యక్తికి పరిచయం అయ్యాడు. రైతుకు తక్కువ ధరకు 300 లీటర్లు డీజిల్ ఇస్తామని నమ్మించి రూ. 25 వేల రైతు నుంచి తీసుకున్నాడు. అ తర్వాత ఆ రైతును చెరువులో తోసి పరారయ్యాడు.