రూ.4.50 లక్షల LOC అందజేసిన MLA
ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం బోడేపల్లి గ్రామానికి చెందిన గొర్లపల్లి వనజకి మంజూరైన LOC ని MLA పాల్వాయి హరీష్ బాబు అందజేశారు. నిమ్స్ ఆసుపత్రిలో బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ శస్త్ర చికిత్స కోసమై వనజకి CMRF ద్వారా రూ.4.50 లక్షల LOC మంజూరు అయింది. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. CMRF పథకం నిరుపేదలకు ఒక వరం లాంటిదని పేర్కొన్నారు.